ఒక గురుకులంలో గురువు శిష్యులకు గజేంద్రమోక్షం కథ గురించి చెబుతున్నాడు. ''మొసలిబారినపడిన గజేంద్రుడు గొంతెత్తి విష్ణుమూర్తిని పిలిచాడు తనను రక్షించమని. సతీమణి లక్ష్మీదేవికి చెప్పకుండా, శంఖచక్రాలు ధరించకుండా, తన వాహనమైన గరుత్మంతుడిని అధిరోహించకుండానే విష్ణుమూర్తి వెంటనే బయలుదేరాడు'' అంటూ గురువు కథ చెప్పడం పూర్తిచెయ్యకుండానే ఒక శిష్యుడు సందేహం వెలిబుచ్చాడు. ''అయ్యా! గజేంద్రుడు అరిచిన తక్షణమే విష్ణుమూర్తి బయలుదేరాడు, అంటే వైకుంఠం ఎంత దూరంలో ఉంది?'' ఈ ప్రశ్నకు గురువు తెల్లముఖం వేశాడు. అదే ప్రశ్న ఇతర శిష్యులకు సంధించాడు- తన అజ్ఞానం బయటపడకుండా. శిష్యులెవరూ సమాధానం చెప్పలేదు.
ప్రశ్న వేసినవాడే ''అయ్యా, గజేంద్రుడు గొంతెత్తి పిలిస్తే ఆ పిలుపు ఎంతదూరం వినబడుతుందో అంతే దూరంలో వైకుంఠం ఉంది'' అన్నాడు.
గురువుకు జ్ఞానోదయమైంది. శిష్యుడు తెలిసీ తెలియకుండా చెప్పిన జవాబులోని పరమపదం గురించిన పరమార్థం అవగతమైంది. వెంటనే శిష్యులకు చెప్పాడు- ''భగవంతుడు సర్వాంతర్యామి, భక్తుడు ఆర్తితో భక్తితో పిలిస్తే వెంటనే పలుకుతాడు'' అన్నాడు. పరమపదసోపానం అధిరోహణలో భగవంతుడు, భక్తుడి వెంటే ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆ చేయి వదలకుండా భగవంతుడి వెంట నడవటమే భక్తుడి విధి.

Very True. We need this deep faith in God. Thanks for a nice post.
ReplyDeletevery True. We need such deep faith in God. Thanks for a Nice Post - v.vijayamohan
ReplyDeleteThats True and reallity. We must need to deep faith in God.
ReplyDeletetruly your blog teaches us manything about the spiritual world.Hope you will cotinue this in future also .Regards and best wishes
ReplyDelete