నువ్వు మాట్లాడినప్పుడు నిజం మాట్లాడు. నువ్వు ఏది వాగ్ధానం చేశావో దాన్ని నెరవేర్చు. నీమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు. నీ చేతుల్ని హింసకు దూరంగా ఉంచు. అన్యాయమైన దాన్నీ, అక్రమమైనదాన్నీ అందుకోకుండా చాచిన చేతుల్ని వెనక్కి తీసుకో.
'ఏ పనులు గొప్ప పనులు?
ఒక మనిషి హృదయాన్ని సంతోషపెట్టడం, ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడం, దెబ్బతిన్నవాళ్ళకి సాయం చేయడం, దుఃఖార్తుల దుఃఖాన్ని తేలికపరచడం, గాయపడ్డవారి గాయాలకు మందు పూయడం'.
'భగవత్‌సృష్టి మొత్తం భగవంతుని కుటుంబమే. ఎవరు భగవంతుడు సృష్టించిన వాటికి హితం కోరుతారో, చేకూరుస్తారో అతడే భగవంతుడికి అందరికన్నా ఎక్కువ ప్రీతిపాత్రుడు.'
No comments:
Post a Comment