మనలో చాలమంది అనుకుంటూ వుంటాం...''అలా వుంటే బాగుండేది...అప్పుడలా వుండి వుంటే...ఇలా జరిగేది...అది చేసేవాళ్ళం...ఇది చేసివుండివాళ్ళం....అలా ఇలా...అంటూ...''
గతాన్ని మర్చిపోండి, మీ వయసును మర్చిపోండి...ఇంకా మిగిలివున్న మీ జీవితంలో ఇదే మొదటిరోజు అనుకోండి....మీ కలలను నిజం చేసుకోవటానికి ఇదే సరైన సమయం...ఈరోజే...ఇప్పుడే ప్రారంభించండి....
1. మీరు మీలానే వుండండి : మీ కలలను నిజం చేసుకోవాలంటే...ముందు మీ అంతరాత్మకు మీరు నిజాయితీగా వుండండి. మీరు చేసేది సరైనదే అని మీకు చాలా బలమైన నమ్మకం వున్నప్పుడు ఇతరుల మాటలను, విమర్శలను పట్టించుకోకండి. మీ వైఫల్యాలనుంచి మరింత నేర్చుకోండి... పైకెదగండి.. ముఖ్యంగా మానసికంగా...మానసికమైన స్థైర్యం, లక్ష్యాన్ని చేరగలననే నమ్మకం ఎప్పుడూ కోల్పోవద్దు.
2. సమయాన్ని కేటాయించండి : రోజులో కొంత సమయాన్ని తప్పనిసరిగా మీ లక్ష్యాన్ని చేరటానికి కేటాయించండి. నిజంగా మీకేం కావాలో, ఏం సాధించాలనుకుంటున్నారో నిరంతరం పరిశీలించుకుంటూ వుండండి. ప్రతిరోజూ హాయిగా నవ్వుకోవటానికి, ఇతరులను ప్రేమించటానికి, (మీ విమర్శకులను) క్షమించటానికి, కష్టాలలో వున్నవారిని ఓదార్చటానికి కొంత సమయం కేటాయించండి. అందరి కష్టాలను మీరు తీర్చలేకపోవచ్చు...కానీ ఒక్క ఓదార్పుమాట, ధైర్యాన్నిచ్చే చేతిస్పర్శ...బాధపడేవారికి చాలా స్వాంతననిస్తుంది...ధైర్యాన్నిస్తుంది.
3. మీరే మార్గనిర్దేశకులు : మీ యీ ప్రయాణంలో మీకు మీరే మార్గనిర్దేశకులు. చాలామంది సామర్థ్యం వున్నా తమ లక్ష్యాలను, గమ్యాలను చేరలేకపోవటానికి ఒక కారణం...అనవసర భయాలు...ఇతరులకు తమపై వున్న అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వటం...గమ్యానికి చేరుకోవటానికి ఇవన్నీ పెద్ద ఆటంకాలే. మీరేమిటో...మీ లక్ష్యాన్ని చేరటంద్వారా నిరూపించుకోండి...మీ నమ్మకాన్ని మరింత దృఢతరం చేసుకోండి. అవసరమైతే పోరాడండి మీ ఏకాగ్రత అంతా మిమ్మల్ని ముందుకు నడిపించే విషయాలపైనే వుండాలి. చివరకు మిమ్మల్ని విమర్శించినవాళ్ళే మీ విజయాన్ని ఒప్పుకోకతప్పదు. మీ జీవితపు పగ్గాలను ఇతరులకు అప్పగించకండి...మీరు విజయం సాధించాలన్నా, పరాజయం పొందాలన్నా మీ చేతుల్లోనే వుంది.
4. చాలా విలువైంది...వృధా చేయకండి : సమయం చాలా విలువైందని మీకందరికీ బాగా తెలుసు...నేను ఇప్పటికీ కొంతమందిని చూస్తుంటాను...అనవసరమైన వాగ్వివాదాలతో, మాటలతో, విమర్శలతో... సమయం చాలా వృధా చేస్తూండటం... మీకు నిజంగా ఖాళీ సమయం దొరికితే.... మంచి పుస్తకాలు చదవండి...అవి మీ జ్ఞానాన్ని పెంచుతాయి. వీలైతే ఇతరులకు సాయం చేయండి. ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటానికి/తెలుసుకోవటానికి ప్రయత్నించండి.
5. మీ ఆలోచనలు మార్చుకోండి : ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. దేన్నైనా సృష్టించగలవు...నాశనం చెయ్యగలవు కూడా. వ్యతిరేకధోరణి సాధ్యమైనంతవరకు తగ్గించుకోండి. సానుకూల దృక్పథాన్ని అలవాటు చేసుకోండి. మీ చుట్టూ చాలా అవకాశాలున్నాయి...పరిశీలించండి.. మీకు తగినవాటిని అందిపుచ్చుకోండి. అవకాశాలు మళ్లీ మళ్లీ రావు..
6. మీరు సాధించగలరు : మీ లక్ష్యం చాలా పెద్దదైనప్పుడు...మీ ప్లాన్లు సాధించటానికి కష్టతరంగా వున్నప్పుడు...ఒక్క అడుగు ముందుకేయండి మీ గమ్యం దిశగా...''వెయ్యిమైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంద''నే విషయం మర్చిపోకండి... ప్రారంభించకుండా మాత్రం లక్ష్యం గురించి కలలు కనొద్దు.
7. ప్రతికూల వాతావరణాన్ని మార్చటానికి ప్రయత్నించండి : మీమీద మీకు నమ్మకం వున్నప్పుడే ఏదైనా సాధించగలరు...మీ చుట్టూ వున్న ప్రతికూలవాతావరణంలో మీ లక్ష్యసాధనకు వుపయోగపడే అనుకూల అంశమేదైనా వుందేమో పరిశీలించి చూడండి. తప్పకుండా కనీసం ఒక్కటైనా కనబడుతుంది. దాన్ని వెతికి పట్టుకుని మీ గమ్యం చేరటానికి ఇంధనంలా వుపయోగించుకోండి.
8. ఆనందకరమైన క్షణాల్ని వదులుకోవద్దు : లక్ష్యసాధనలో ఎంత బిజీగా వున్నా...మిమ్మల్ని సంతోషపరచే నేస్తాన్ని, సంగీతాన్ని, సాహిత్యాన్ని, పుస్తకాలను...నిరంతరం మీ శ్రేయస్సు కోరేవాళ్ళని...మీరు మర్చిపోవద్దు...దూరం కావద్దు...ఎంతగా పనిచేస్తారో....అంతగా రిలాక్స్ అవడం కూడా నేర్చుకోవాలి.
9. నిజాయితీగా ప్రేమించండి : మీరు నిజంగా ఎవర్నైతే యిష్టపడుతున్నారో...వారితో నిజంగా ప్రేమగా వుండండి...ప్రేమగా మాట్లాడండి...ఎవరి సాంగత్యంలో మీరు హాయిగా, సంతోషంగా వుండగలరో.... వారితో ఎక్కువ సమయం గడపండి...మీ ఆనందం రెట్టింపవుతుంది... వ్యక్తిగతంగా కలవకపోయినా...ఉత్తరాలద్వారానో, ఫోన్లద్వారానో, ఈ-మెయిల్స్ ద్వారానో మీ ప్రేమను వ్యక్తం చేయండి..
10. ఆఖరుది...కానీ చాలా ముఖ్యమైనది : మిమ్మల్ని విమర్శించేవారి గురించిగాని... మీరంటే ఇష్టంలేనివారి గురించి ఆలోచించి బాధపడకండి.. వేదన పడకండి... మీరంటే ఇష్టంలేనివాళ్ళు కొంతమంది వున్నా.... ఇష్టపడేవాళ్ళు చాలామంది వుంటారు... మీకోసం...మీ ప్రేమకోసం ఎదురుచూసేవాళ్ళు చాలామంది వుండేవుంటారు... వారి దగ్గరికెళ్ళండి... మీ ప్రేమను పంచండి... అవసరమైతే సాయం చేయండి...అప్పుడు చూడండి... మీరెంత సంతోషాన్ని పొందుతారో... నిజమైన సంతోషం ఎక్కడ వుందో తెలుసుకోవటానికి ప్రయత్నించండి..
లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్....విమర్శలనుంచే పైకెదగటానికి ప్రయత్నించండి...ఆటంకాలు ఎదురైనప్పుడల్లా మరొక్క అడుగు ముందుకు వేయటానికి ప్రయత్నించండి.
ఈ చిన్న కథ మీతో పంచుకోవాలని వుంది :
కాలేజి చదువుకూడా పూర్తికాకుండానే చదువు మానేసిన 38 ఏళ్ళ ఒక లైబ్రేరియన్ రాసిన లేఖ :
''నాకు చిన్నప్పటినుంచీ మా తాతగారిలా సైకాలజిస్ట్ కావాలని జీవితకాలపు కోరిక. నా ప్రస్తుత వుద్యోగం నాకు బాగానే వున్నా...మనసులో వున్న యీ తీవ్రమైన కోరికవల్లనో...దేనివల్లనో గానీ మెల్లగా నన్ను సలహాలడిగే వారి మానసిక సమస్యలకు నేను సలహాలనిస్తూ వారి సమస్యా పరిష్కారాలకు మార్గదర్శినయ్యాను...చాలామంది ఇప్పటికీ నన్నొక మానసికవైద్యునిగా భావిస్తూ కౌన్సిలింగ్‌కు వస్తూంటారు.
కానీ నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి, డిగ్రీ పూర్తిచేసి, సైకాలజీలో డాక్టరేట్ చేసి, ప్రాక్టీస్ ప్రారంభించాలంటే...కనీసం 8 ఏళ్ళు అవుతుంది. అప్పటికి నా వయసు 46 ఏళ్ళు అవుతుంది...ఏం చెయ్యాలో తెలియటం లేదు...'' అంటూ...
కొన్ని ప్రశ్నలలోనే జవాబు వుంటుంది.
అతను పొందిన జవాబు :
''మీరిది (సైకాలజీ డాక్టరేట్) చెయ్యకపోతే...ఈరోజు నుంచి 8 ఏళ్ళ తరువాత మీ వయసు ఎంత?''
మనమంతా కూడా ఇల్లు, పిల్లలకు మంచి చదువు, ఒక కారు... ఇలాంటివెన్నో కావాలని కలలు కంటూ ఉంటాం. మన కుటుంబసభ్యులకు చక్కటి జీవితాన్ని అందించాలని ఆశిస్తుంటాం. మనం కోరుకున్నవన్నీ కోరుకున్నట్లుగా జరుగవు. అలా జరిగితే ఇక జీవితానికి అర్థమే ఉండదు. నిజానికి జీవితం ఎన్నో అనిశ్చితిలతో కూడుకుని ఉం టుంది. ఏవిధ మైన అనిశ్చితి లేకుండా జీవితం ఉండగలదని ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. ఈ విధమైన అని శ్చితిలపెై బీమా కలిగి ఉండడం ద్వారా అనుకోనిదేదెైనా జరిగితే కొంతవరకైనా కుటుంబానికి కొంత ఆర్థిక సాయం చేసినట్లవుతుంది.
ReplyDelete