పుస్తకాలు మన నిత్య సహచరులు, ఒక మంచి పుస్తకం చదవడం, దాన్ని భద్రంగా దాచుకోవడం మన జీవితానికి ఒక శాశ్వత ఆవరణ సమకూర్చుకోవటం లాంటిది. మంచి పుస్తకం మనకొక నిత్య సహచరి. కొన్ని పుస్తకాలు మనకన్నా ముందు పుట్టి మన జీవితంలో మనకు దారిచూపుతూ, మన తదనంతరం కూడా అలా మార్గనిర్దేశం చేస్తూనే వుంటాయి.
అన్ని రకాలు పుస్తకాలు చదవటం నాకిష్టమే....మరీ ఇష్టమైన పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువుతూ వుంటాను. ప్రతీసారీ ఏదో ఒక్క కొత్త విషయాన్ని నేర్చుకుంటూ, సంతోషపడుతూంటాను. ఇటీవలే చదివిన ''ఎవరికీ తలవంచకు'' (Indomitable Spirit by A.P.J. Abdul Kalam - తెలుగు అనువాదం : వాడ్రేవు చినవీరభద్రుడు)...అద్భుతమైన పుస్తకం....మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేంత గొప్ప పుస్తకం....అన్నిటికన్నా మించి...ప్రతి ఒక్క విషయమూ ఆలోచింపచేస్తూ....మనసును కొన్ని విషయాల్లో ప్రక్షాళన చేస్తోంది...మీకు అందుబాటులో వుంటే తప్పకుండా ఒకసారి చదవండి. మార్పు మీకే తెలుస్తుంది!
మంచి పుస్తకాలు నా ఆప్తమిత్రులు
నేను క్రుంగిపోయినప్పుడు నాకు ధైర్యాన్ని నూరిపోస్తాయి
ప్రేమతో మనసుకు స్వాంతన కలిగిస్తాయి...
అందుకే నా దగ్గరి వాళ్ళకు చెబుతుంటాను....పుస్తకాలతో స్నేహం చేయమని అవి మంచి మిత్రులవుతాయని''
(మీరిప్పుడు చదివినదంతా ఆ పుస్తకం సూర్తితో రాసిందే!)

No comments:
Post a Comment