ఆమె సమున్నత శిరస్కురాలై
అభీతనేత్రాలతో
నిర్భయంగా సంచరిస్తుంది
ఆమెకు నిర్దిష్ట విశ్వాసాలుంటాయి
విశాల ఆదర్శాలుంటాయి
జ్ఞానం వల్ల సిద్ధించిన కించిత్ గర్వం కూడా వుంటుంది
సుశిక్షితురాలైన అటువంటి విదుషీమణి
తానెంచుకున్న మార్గాన్ని తప్పదెన్నటికీ
ఆమె అజ్ఞానాన్ని పారద్రోలుతుంది
సుజ్ఞాన మనస్కయై జీవితానందాన్ని స్వాగతిస్తుంది
మేల్కొన్న మహిళల ప్రవర్తన ఇలా వుంటుంది
మనదేశపు స్త్రీలందరికీ మహాకవి కన్న స్వప్నం నిజమయ్యే రోజు తప్పక వస్తుందనీ, త్వరలో రావాలని ఆకాంక్షిస్తూ...
No comments:
Post a Comment